Allu Arjun: తెలుగు రాష్ట్రాల సీఎంలపై విమర్శలు.. 9 d ago
అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల సీఎంలు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డిపై పలువురు విమర్శలు ఎక్కు పెడుతున్నారు. సంధ్య థియేటర్ తొక్కిసలాటలో మహిళ మృతికి తన ప్రమేయం లేకపోయినప్పటికీ అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారని, మరి హైడ్రా కూల్చి వేతల వల్ల ఇద్దరు ఆత్మహత్య చేసుకుంటే సీఎం రేవంత్‌రెడ్డిని ఎందుకు అరెస్ట్ చేయలేదని బీఆర్ ఎస్ నేత కేటీఆర్ ప్రశ్నించారు.
ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కూడా ఇదే విషయమై స్పందించారు. సీఎం చంద్రబాబు నాయుడు గత ఎన్నికల ముందు తన పొలిటికల్ ర్యాలీలో సాధారణ ప్రజలు దుర్మరణం చెందిన విషయాన్ని ప్రస్తావించారు. గత ఎన్నికల ర్యాలీలో ప్రకాశం జిల్లా కందుకూరులో 8 మంది, గుంటూరులో ముగ్గురు చనిపోయినా చంద్రబాబును ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. 2015 గోదావరి పుష్కరాల సమయంలో అప్పటి సీఎం చంద్రబాబు మీడియా స్టంట్ల వల్ల తొక్కిసలాట జరిగిన 23 మంది చనిపోతే.. ఎందుకు కేసు పెట్టలేదని నిలదీశారు. ఆర్టికల్ 14 వయోలేషన్ అని, వెంటనే అల్లు అర్జున్‌ను రిలీజ్‌చేయకపో్తే..కోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేస్తానని కేఏ పాల్ చెప్పారు. అసలు అల్లు అర్జున్‌ను ఎందుకు అరెస్ట్ చేస్తారని తాను ప్రశ్నిస్తానన్నారు.
ఇదే విషయంపై సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా పోస్టులు పెడుతున్నారు. ఇదంతా ఉద్దేశ పూర్వకంగా జరుగుతోందని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.